మాయ ప్రధాని అయినా...మీరు సీఎం కాగలరా

గురువారం, 17 జులై 2008 (12:25 IST)
వార్త: బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పడి, ఆమె ప్రధాని అయితే మొదట స్వాగతించేవారు తామేనని చెప్పిన కేసీఆర్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ కూటమిలో టీడీపీ ఉన్న తమకు అభ్యంతరం లేదన్నారు.

చెవాకు: మీకు తెలంగాణా కంటే ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి ఉన్నట్టుంది. తెలంగాణ వాదనకు మద్దతిచ్చే బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంలో తప్పేమీ కన్పించలేదు. అయితే ఇప్పటివరకు తెలంగాణపై ఎటూ తేల్చని టీడీపీ కూడా ప్రస్తుతం అదే కూటమిలో ఉంది. గౌడ్ కూడా బయటకు వెళ్లిన తర్వాత ఆ పార్టీలో తెలంగాణకు గట్టి మద్దతు పలికే వారే కన్పించడం లేదు.

ప్రధాన మంత్రి పదవే ధ్యేయంగా ఉన్న మాయావతి రాజకీయ లాభం వస్తుందనుకుంటే టీడీపీకోసం మిమ్మల్ని పక్కనబెట్టినా పెట్టవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఆ కూటమిపై అతిగా ఊహించుకుంటున్నట్టు అన్పిస్తోంది. సీఎం పదవిగాక తెలంగాణా మాత్రమే మీ నినాదమైతే దానికి మద్దతిచ్చే దేవేందర్ గౌడ్‌తో లేక బీజేపీతో జత కట్టొచ్చుగా. అలా జత కడితే మీ సారధ్యానికి భంగం వాటిల్లుతుందనుకుంటున్నారేమో. నరేంద్రను బయటకు పంపేందుకే చాలా కష్టపడాల్సి వచ్చినందున మళ్లీ కొత్త తలనొప్పులు ఎందుకు అనుకుంటున్నారా.

వెబ్దునియా పై చదవండి