మీకూ.... మెజారిటీ తగ్గిందిగా

Srinivasulu

మంగళవారం, 10 జూన్ 2008 (09:10 IST)
వార్తః ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే ఓటమి ఎదురైందని చెప్పిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ప్రజల మధ్య మంచి పేరు ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ప్రకటించారు.

చెవాకుః మీరు చెప్పడం బట్టి చూస్తే ఈ దఫా ఓడిన వారంతా ప్రజల్లో మంచి పేరు లేని వారేనన్న మాట. అంటే మంచి నేతలను మీరు బరిలో దించ లేకపోయారనేగా అర్థం. ఆ లెక్కన మీకు అత్యంత సన్నిహితులైన మాజీ శాసనసభా పక్షం నేత విజయరామారావు, నాయని నర్సింహారెడ్డిలు కూడా ప్రజల్లో విశ్వాసం కోల్పోయినట్టే కదా. అందులోనూ ముర్షిదాబాద్‌లో మూడో స్థానంలో నిలిచిన నాయని కథ అంతేగా. అయ్యో పాపం... మిమ్మల్నే నమ్ముకుని మీ కోసమే పని చేసినందుకు వారి కథ కంచినేనని ముందే తేల్చేశారు. అయినా మీకూ మెజారిటీ బాగా తగ్గిందిగా మరి. దాని మాటేమిటి?

వెబ్దునియా పై చదవండి