వార్త: భారత్ అణు పరీక్షలు నిర్వహిస్తే అణు ఇంధన సరఫరాను నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అమెరికన్ కాంగ్రెస్‌కు తొమ్మిది నెలల క్రితం రాసిన లేఖను వాషింగ్టన్ పోస్ట్ బహిర్గత పరచింది.
చెవాకు: దీనికోసమేనా ఇంత ఆరాటం? చివరకు సర్కారును సైతం పణంగా పెట్టి పోరాడటమా? ఒప్పందం అమలు జరిగితే అణు పరీక్షలు నిర్వహించడం కష్టమని, దేశ సార్వభౌమత్వానికి దెబ్బ తగులగలదని ప్రతిపక్షాలు చెప్పిన మాట నిజమే అయ్యేట్టుందే.
ఏది ఏమైనా ప్రపంచ రారాజు కావాలనుకుంటున్న అమెరికాతో జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయం బోధపడి ఉంటుంది. ఇంతకీ ఈ లేఖ విషయం ముందే తెలిసిన విషయమేనని కేంద్ర అణు శక్తి ఛైర్మన్ కకోద్కర్ కూడా చెప్పారనడం మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది