వివాదానికి కాదేదీ అనర్హం

వార్త: కత్తి పద్మారావు కుమారుడితో తమ కుమార్తె నళినికి ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి బెదిరించి పెళ్లి చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. తమ అనుమతి లేకుండా చిరంజీవే స్వయంగా కన్యాదానం కూడా చేశారని వారు దుయ్యబట్టారు.

చెవాకు: ఏది ఎలా జరిగినా రాజకీయాల్లోకి వస్తే ఏదో రకంగా బురద పైన పడితీరుతుందనడానికి ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రజా జీవితంలోకి రాకుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదేమో! తమ బిడ్డ తమను కాదని మరొకరిని పెళ్లాడటం ఏ తల్లిదండ్రికైనా బాధాకరంగానే ఉంటుందనే విషయాన్ని కాదనలేము. మీరు దానిని స్వయంగా అనుభవించారు కాబట్టి ఈ పాటికే అర్థమై ఉంటుంది.

తమ బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేక అలా మాట్లాడితే ఫర్వాలేదు కానీ...తప్పంతా మీదేనన్నట్టు చెప్పడంలో రాజకీయం కన్పించడం లేదూ. ఇదే కాదు..ముందు ఇంకా ఇలాంటివి చాలా వస్తాయి. అయినా బాణాన్ని వెనక్కు లాగే కొద్దీ అది లక్ష్యం దిశగా మరింత వేగంగా ముందుకు కదలగలదని చెప్పిన మీరు తప్పక ఈ విషయంలో జాగ్రత్త వహిస్తారనుకుంటా

వెబ్దునియా పై చదవండి