బెంగళూరులో నిన్న ఆదాయపన్ను అధికారుల తనిఖీల్లో పట్టుబడిన రూ. 5 కోట్ల నగదు వ్యవహారంపై ఓ మౌత్ పబ్లిసిటీ తిరుగుతోంది. అదేంటయా అంటే... బెంగళూరుకు చెందిన ఇద్దరు బడా కాంట్రాక్టర్లు కమ్ ఇంజినీర్ల వద్ద బోలెడు డబ్బు ఉంది. అదేనండీ పాత రూ.500, రూ.1000 నోట్లు. నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటనతో వారు తల్లడిల్లిపోయారట. అలా బెడ్ మాళిగల్లో( అంటే మంచం పరుపు కింద) దాచిపెట్టుకున్న బ్లాక్ మనీని ఎలా మార్చుకోవాలో అర్థంకాక దిమ్మతిరిగిపోయారట.
ఆల్రెడీ వీళ్ల బ్లాక్ మనీ వ్యవహారం తెలిసిన ఓ వ్యక్తి ( బ్రోకరు) తనకు కొందరు బ్యాంక్ సిబ్బంది తెలుసుననీ, వారి ద్వారా నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవచ్చని సలహా ఇచ్చాడట. అతడు చెప్పినట్లే వారు సదరు బ్యాంక్ సిబ్బందితో కలవడమే కమీషన్లు గట్రా మాట్లాడుకోవడం అంతా జరిగిపోయిందట. మధ్యలో బేరం కుదిర్చిన వ్యక్తి(బ్రోకరు)కి ఇస్తానన్న కమీషన్ ఇవ్వలేదట.