వార్త : త్వరలోనే కాశ్మీర్ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకు వచ్చేలా శుభవార్త వినగలరని పాక్ ప్రజలకు హామీ ఇచ్చిన కొత్త అధ్యక్షుడు జర్దారీ దానిపై వివిధ రాజకీయ పక్షాలతో చర్చిస్తున్నామన్నారు.
చెవాకు : అంటే ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యకు నెలరోజుల్లో పరిష్కారం చూపిస్తారన్న మాట. అది సాధ్యమేనా అనే అంశం పక్కనబెడితే అసలు ఆ అంశం పరిష్కారం కావాలనే కోరిక మీలో ఉందా అన్నదే అనుమానంగా ఉంటోంది.
ముషారఫ్ నియంతృత్వ పాలన వెళ్లినా మీరు పాక్ రాజ్యాధికారం విషయంలో అవలంబిస్తున్న వైఖరి మీ దేశంలోనే పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇంట గెలిచిన తర్వాత కదా రచ్చ గెలిచేందుకు కృషి చేయాలి. మీరెందుకు ఇంతలోనే ఈ విషయంలో తొందరపడుతున్నారు.
ఒక వేళ రచ్చ గెలిస్తే ఇంటి సమస్యలన్నీ పరిష్కారమైపోతాయనుకుంటున్నారో ఏమో. ముషారఫ్ కూడా అలాగే అనుకుని పప్పులో కాలేసారనే విషయం తెలుసుకోండి. అన్నీ అమెరికా అనుకూల విధానాలే అవలంబించినా చివరకు కష్టకాలంలో అదే అమెరికా చేతులెత్తేసిందనే విషయం గ్రహంచి మసలుకుంటే మంచిది.