అంటే రాజకీయాల్లో వేస్ట్ అన్నమాట

మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (17:54 IST)
FileFILE
వార్త : ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు నిరాకరించే అవకాశం ఉందని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ విశ్వసనీయత లేకుంటే రాజకీయాల్లో ఉండడం అనవసరమని సోనియా కూడా చెబుతున్నారని పేర్కొన్నారు.

చెవాకు : అంటే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టికెట్టు దక్కని వారందరూ ప్రజల విశ్వాసం కోల్పోయిన వారేనని ముందుగానే తేల్చేస్తారన్న మాట. ప్రజల విశ్వసనీయత గురించి బాగా తెలిసినందునే మీరు విశ్వసించే వారినే (మీ భజన చేసే వారినే) మంత్రి వర్గంలో ఉంచుకుంటున్నారన్నమాట.

అంతవరకు బాగానే ఉంది. టికెట్లు రాని వారు మీ దృష్టిలో ప్రజల విశ్వాసం కోల్పోయిన వారుగా ఉన్నందున...వారు రాజకీయాల్లో ఉండడం కూడా వేస్టనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పడంలో ఆంతర్యమేమిటి?

సోనియా మరీ మరీ ఇదే విషయాన్ని చెబుతున్నారనడం ద్వారా పక్కకు తప్పుకోవాలని వారికి సూచించినట్టేనా. అన్ని ప్రభుత్వ పథకాలకు ఇందిరా, రాజీవ్‌ పేర్లు పెట్టి, మీరు ప్రజల (మీ పార్టీ అధిష్టానం) విశ్వసనీయత పొందిన స్థాయిలో మిగిలిన వారు పొందలేదన్నదే వాస్తవం.

వెబ్దునియా పై చదవండి