వార్తః తెలంగాణాపై పార్టీకి, ప్రజలకు నష్టం కలగని రీతిలో నిర్ణయం తీసుకుంటామని టీడీపీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు.
చెవాకుః అలాంటి నిర్ణయం తీసుకోగలమనే నమ్మకం మీకుందా. అదే గనుక ఉంటే ఎనిమిదేళ్ల వరకు ఆగాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది. మీ పార్టీకి అసలు బలమేమో కోస్తాలో ఉందని మీకు తెలుసు. ప్రత్యేక తెలంగాణాకు అసలు సమస్యంతా కోస్తా నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన వారి నుంచేనన్నది అందరికీ తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో గెలిచినా మీరు సాధించేదేమీ లేదు. వీటి కోసం నోరు జారి కోస్తాలో ఉన్న బలాన్ని కూడా కోల్పోతారేమో. బాగా ఆలోచించండి. అయినా ఏ ప్రజలని చెప్పలేదు కాబట్టి అవసరమైతే దానిని రేపు కోస్తా ప్రజలుగా కూడా మార్చుకోవచ్చులే.