వార్త : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలం.
చెవాకు : ఇన్నాళ్లు సమైఖ్య రాష్ట్రమే తమ నినాదమంటూ చెప్పుకొచ్చిన టీడీపీ వారు సైతం ప్రత్యేక తెలంగాణకు అనుకూలమేనంటూ చెప్పేశారు. ఇప్పుడు ఒకవేళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ ఘనత టీడీపీకి చేరుతుందా... లేక ఆ అంశంతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు దక్కుతుందా...
లేక ప్రత్యేక తెలంగాణ కోసం ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమంటోన్న టీఆర్ఎస్‌కు దక్కుతుందా... లేక తెలంగాణ కోసం కొత్త పార్టీ పెట్టిన దేవేందర్ గౌడ్‌కు దక్కుతుందా... వీరెవరికీ కాకుండా రాష్ట్రంలో పార్టీ పరంగా ఏమాత్రం బలం లేకున్నా తెలంగాణకు అనుకూలం అంటూ చెప్పే బీజేపీకి దక్కుతుందా... ఈ ప్రశ్నకు సమాధానం తెలిసీ చెప్పకపోతే పాపం రాష్ట్ర ప్రజల తలలు పగిలిపోకుండా ఉంటాయా... ???