వార్త : తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రూ. 500కోట్ల సహకారేతర చేనేత రుణాలను మాఫీ చేస్తామని, వారికి జీవితాంతం బీమా పథకాన్ని వర్తింపజేస్తామని, వృద్ధ కార్మికులకు నెలకు రూ. వెయ్యి పింఛన్‌గా అందిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలిపారు.
చెవాకు : తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో వారి బాగోగులు ఎందుకు పట్టించుకోలేకపోయారు. ఎలా చేసినా గెలుపు మీదేనన్న నమ్మకంతోనే కదా.
అప్పటికీ, ఇప్పటికీ వారి జీవితాల్లో పెద్దగా తేడా లేదన్నది మీకూ తెలిసిందే. రైతుల బతుకులు ఎలా ఉన్నాయో చేనేత బతుకులు అంతకన్నా దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని ఇప్పటికైనా నిజంగా గ్రహించారంటే మంచిదే.
కానీ ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మీరు ఐటీ బాట పట్టి, చేనేతలకు ఇచ్చిన హామీపై మాట మార్చితే...మీకు జీవితం ఏదో రకంగా సాగుతుందేమో కానీ,,,వారు మాత్రం ప్రమాదాన్ని మళ్లీ కొని తెచ్చుకున్నామని చింతించే పరిస్థితి ఏర్పడగలదు.