వార్తః కేసీఆర్ ఆదేశిస్తే మళ్లీ రాజీనామా చేస్తానని ఆయన మేనల్లుడు, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు ప్రకటించారు.
చెవాకుః ఇంత జరిగిన తర్వాత కూడా ఏంటయ్యా ఈ మాటలు. ఇప్పటికే రాష్ట్ర శాసనసభలో పార్టీ బలం 26 నుంచి ఏడుకు పడిపోయాయి. మీ బలం కన్నా అసమ్మతి వాదుల బలం అధికంగా ఉండటంతో వారూ మాదే అసలు తెరాస అంటూ పోటీ పడుతున్నారు. మీ నాయకుడేమో ఢీలా పడిపోయి, అస్త్ర సన్యాసానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇదంతా అవసరమా? ప్రజలు అనవసర ప్రకటనలతో రెచ్చిపోరన్నది కూడా తెలిసిపోయిందిగా. ఎలాగూ ఇక రాజీనామా చేసినా ఉప ఎన్నికలు జరిగేది లేదు. కాస్త ప్రశాంతంగా ఉండొచ్చుగా.