వార్త : ఎరువుల కొరతకు అక్రమనిల్వలే కారణమని ఆరోపణ చేసిన టీడీపీ నేతలు రెండు రోజులుగా కృష్ణా జిల్లాలో తాము జరిపిన తనిఖీల సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 1.23 లక్షల ఎరువుల బస్తాలను కనుగొన్నామని తెలిపారు.
చెవాకు : సెభాష్. ఎట్టకేలకు ఓ మంచి పని చేశారు. రైతుల సమస్యను మీ భుజాలకెత్తుకుని రైతుల కోసం ఎరువుల అక్రమ నిల్వలను పసిగట్టి, బయటపెట్టారు. మీ ఆందోళన ఫలితంగా అధికారులు కూడా వాటిని 48 గంటల్లో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ తప్పు ఎవరిదంటారు? ఈ అక్రమ నిల్వల ద్వారా తప్పు చేసిన వారు ఎవరనే విషయం తెలుస్తూనే ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఆ అక్రమార్కుల భరతం పట్టే వరకు మీ ఆందోళన కొనసాగించాలిగా.
కేవలం ప్రభుత్వంపై బురదజల్లడం వరకే మా పని అనుకుంటే సరిపోదు. రైతులకు అన్యాయం తలపెట్టిన వారికి తగిన గుణపాఠం నేర్పే వరకు పోరాటాన్ని కొనసాగిస్తేనే దానికి ఓ అర్థం ఉంటుంది.