వార్త: భార్యను వేధించిన కేసుకు సంబంధించి, ఆదోని మేజిస్ట్రేట్ వెంకటరమణపై హైకోర్టు ఆదేశాల మేరకుకడప వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ తెలిపారు.
చెవాకు: మీరూ మనిషేగా. తప్పులు చేయకూడదని మీకు ఏమైనా రూలు ఉందా. అయినా ఉన్నత స్థానంలో ఉన్నామనే విషయాన్ని ఎలా మరచిపోయారు. పెళ్లయి 17 ఏళ్లు అయిన తర్వాత కూడా భార్యను వేధించడమేంటి. పెద్దరికాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని ఎలా విస్మరించారు.
ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోకపోవడమంటే మరి ఇదేనేమో. నలుగురికీ న్యాయం చెబుతారనే విశ్వాసంతో మీ ముందు అందరూ చేతులు కట్టుకుని, ప్రార్థిస్తుండగా, మీరేంటి పోలీసులు మీ కోసం వేటాడే పరిస్థితి వరకు తెచ్చుకున్నారు. న్యాయమూర్తులే ఇలా తప్పులు చేస్తుంటే. ఇక సామాన్యుల మాటేమిటి.