ఇదేంటి బాబూ

గురువారం, 10 జులై 2008 (16:09 IST)
వార్త: కాంగ్రెసేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పిన అసోం గణ పరిషద్ చీఫ్ బృందావన్ గోస్వామి పొత్తు దిశగా బీజేపీతో మరో అడుగు ముందుకేశామన్నారు.

చెవాకు: మీరేమో వామపక్షాలంటారూ. మీ కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ ఏమో ఇప్పటికే కాంగ్రెస్ పక్కకెళ్లిపోయింది కదా అనుకుంటే తాజాగా ఇదేం గొడవయ్యా. మీ కూటమిలోనే ఉన్నామంటున్న అసోం గణ పరిషద్ ఇపుడు బీజేపీతో చర్చలు జరుపుతున్నామంటోంది.

అంటే లెఫ్ట్‌తో మీరు, బీజేపీతో అసోం గణ పరిషద్ చర్చలు జరిపి ఒకే తాటిపైకి తెస్తామనుకుంటున్నారా. అదెలా కుదురుతుంది. అయినా మీరు మాత్రం అవసరమనుకుంటే బీజేపీకి చేరువయ్యేందుకోసం లెఫ్ట్‌కు పంగనామాలు పెట్టరని గ్యారంటీ ఏమిటిలే.

వెబ్దునియా పై చదవండి