దొరికితేనేగా దొంగ!

శుక్రవారం, 29 ఆగస్టు 2008 (17:11 IST)
వార్త: అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడిలో పట్టుబడిన రంగారెడ్డి జిల్లా భూ సేకరణ విభాగం (పరిశ్రమలు) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాం గోపాలరావు ఆస్తుల విలువ రూ. 500లకోట్లకు పైగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

చెవాకు: ఇంతకాలం ఆయన అవినీతి కార్యకలాపాలకు ఇంత భారీ స్థాయిలో సహకారం అందిందన్న మాట. అవినీతిని ఎక్కడికక్కడ తుంచకపోవడంతోనే ఈ అవినీతి కుబేరులు రాజ్య మేలుతున్నారు.

ఇంత భారీ స్థాయిలో అక్రమార్జనను కూడగట్టారంటే వీరి ద్వారా మరెందరో అక్రమ ప్రయోజనం పొందినట్టేగా. ఈ దెబ్బతోనే వారిని కూడా పట్టుకుంటారా. లేక తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేస్తారా. మీరే చెప్పండి సారూ.

వెబ్దునియా పై చదవండి