ధీమాగా చెప్పిందెవరయ్యా?

గురువారం, 12 జూన్ 2008 (09:53 IST)
వార్తః తెలంగాణా అంటే చాలు గెలుస్తామనే ధీమా నేతల్లో పెరగడం వల్లే ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందన్న కేసీఆర్ తెలంగాణా భవన్ చుట్టూ, తన చుట్టూ తిరిగే బదులు ప్రజల్లోకి వెళితే ప్రయోజనం ఉండేదని చెప్పారు.

చెవాకుః మీరు కూడా గతంలో ఇదే అనుకున్నారుగా. తెలంగాణా పేరు చెబితేనే సమైక్య వాదులకు హడల్ అన్నారుగా. మీరు చెప్పిన విషయాన్నే మీ నేతలు గట్టిగా నమ్ముకున్నారు. మీ చుట్టూ తిరుగుతున్న వారికే ప్రాధాన్యమిచ్చారని తెలిసేగా వారు మీ చుట్టూ తిరిగారు. మీ విధానాల్ని విమర్శించిన నేతల మాటలేనాడైనా మీరు పట్టించుకున్నారా? సూటిగా మాట్లాడే వారిని తెలంగాణా ద్రోహులంటూ ముద్ర వేశారు. నచ్చిన రీతిలో వ్యవహరించేవారిని నమ్మి మొదటికే మోసం తెచ్చుకున్నారు.

వెబ్దునియా పై చదవండి