పంతాలు, పట్టింపులు ఆగవు

శుక్రవారం, 30 మే 2008 (09:53 IST)
వార్తః తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికలకోసం చేసిన భద్రతా ఏర్పాట్ల కోసం రూ.11కోట్ల మేర ఖర్చయిందని డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్ తెలిపారు.

చెవాకుఆరు నెలల పదవి కోసం రూ. 11కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కావడం బాధాకరమే. అయినా మీరు ఈ వివరాలను అందించినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోవు. ప్రజాధనం దుర్వినియోగం కావడం కన్నా అసలు లక్ష్యం (ఉన్నత పీఠం) దక్కేవరకు పంతాల్లో నెగ్గడమేగా రాజకీయ నేతలకు ముఖ్యం. ఎలాగూ ఈ ఎన్నికల కారణంగా ఓటర్లు కూడా ఏదో కొంత లాభపడ్డారన్నది ఊరట కలిగించే విషయం. ఆ ఊరటతోనే ఈ ఎన్నికల భారాన్ని దిగమింగుకుందాం.

వెబ్దునియా పై చదవండి