వార్త : తెలుగుదేశం పార్టీలో రెండో స్థానానికి ఎదిగిన తాను పదవుల కోసం బయటకు రాలేదని, తెలంగాణను ప్రజలే నిర్మించుకోవాలన్నదే తమ అభిమతమని నవ తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.
చెవాకు : నిజంగా తెలంగాణకోసమే పోరాడుతున్నారా. ఒకవేళ తెలంగాణ వచ్చేస్తే ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫర్వాలేదంటారా. ఇదే మీ నిర్ణయమైతే కాస్త ముందుగానే దీనిపై కదిలి ఉండాల్సింది.
గత పర్యాయం టీడీపీ అధికారం కోల్పోయినా ఆ తర్వాత కూడా రెండేళ్ల వరకు పెద్దగా తెలంగాణపై నోరు మెదపని మీరు అకస్మాత్తుగా ఆ భజన చేయడంలో ఆంతర్యమేమిటి?
టీడీపీలో ఇక ఏ మాత్రం ముందుకు వెళ్లడం సాధ్యం కాదని తెలుసుకున్నందునే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారని మీ ప్రత్యర్థులు చేసే విమర్శలకు మీరెలా సమాధానమిస్తారు. తెలంగాణపై కేసీఆర్ చేస్తున్న పోరాటానికి మించి మీరు పోరాడగలరా.