వార్తః పెట్రో ధరలను ఏకపక్షంగా పెంచినందుకు నిరసనగా నాలుగు రోజుల్లో కేంద్రానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రకటించారు. చెవాకుః మీ వ్యవహారం గదిలో బంధించి పిల్లిని...అన్నట్టు ఉంది. అయినా ఇక్కడ వారు పిల్లీ కాదు. ఏ నాడూ వారు మీకు సమాధానం చెప్పినట్టే లేదు. ఆఖరుకు అణు ఒప్పందాన్ని సైతం తాత్కాలికంగా వాయిదా వేశారు కానీ అది తప్పని వారు ఏనాడు చెప్పలేదు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువున్నందున ఏం జరిగినా ఫర్వాలేదనే నిర్ణయానికి వారు వచ్చి ఉండొచ్చు. ఇక ఈ బెదిరింపులన్నీ చెల్లకపోవచ్చేమో. చెప్పాలంటే మరి కొద్ది రోజుల్లో అణు ఒప్పందాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధ పడినా ఆశ్చర్య పోనక్కర లేదు. అభివృద్ధికి మీరు అడ్డు తగులు తున్నారనే ప్రచారాన్ని కూడా ముందుకు తీసుకురావచ్చు.