వార్త : ముఖ్యమంత్రి పదవికోసం వైఎస్, బాబు, చిరంజీవిలు పాకులాడుతున్నారని నవ తెలంగాణ ప్రజాపార్టీ చీఫ్ దేవేందర్ గౌడ్ ఆరోపించారు.
చెవాకు : మీకు మాత్రం ఆ ఆశ లేదా చెప్పండి. తెలంగాణ వస్తే బీసీ వర్గాలతో ఉద్యమం చేసి, ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదా. అది గ్రహించేగా కేసీఆర్ మిమ్మల్ని ఓ అడుగు దూరంగా పెడుతున్నారు.
పొత్తు కోసం మీ దగ్గరికి ఎవ్వరూ రాలేదన్నదే కదా మీ బాధ. అయినా ఎన్నో ఏళ్లుగా తెలంగాణను నెత్తినెక్కించుకుని, ఉద్యమం చేస్తున్న కేసీఆర్‌ను కాదని మీ దగ్గరికి వస్తే మీరేమైనా ఇన్ని సీట్లు వస్తాయని ఆ పార్టీలకు గ్యారంటీ ఇవ్వగలరా.
రాజకీయాల్లో ఎవరి అవసరాలు వారివనే విషయం మీకు తెలియదా. ఇంకా పొత్తులు కొలిక్కిరాని తరుణంలో బేదాభిప్రాయాలు ఏర్పడితే కొన్ని పార్టీలైనా మీతో పొత్తుపెట్టుకునేందుకు ముందుకు వస్తాయి. బీజేపీలా అంతవరకు వేచి చూస్తే సరిపోతుంది. మరేమంటారు?