మీరు వాడుకోలేదా?

గురువారం, 25 సెప్టెంబరు 2008 (15:43 IST)
వార్త : ఎవరినైనా కరివేపాకులా వాడుకుని వదిలేయడంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దిట్ట అని, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినందునే నందమూరి వంశంపై ఆయనకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రజారాజ్యం నేత భూమా నాగిరెడ్డి దుయ్యబట్టారు.

చెవాకు : మీరు మాత్రం అలా చేయరా ఏంటి? రాజకీయాల్లో ఎదగాలంటే ఇతరులను కరివేపాకులా వాడుకుని వదిలేయాలనే విషయం ఇంత రాజకీయ అనుభవం కలిగిన మీకు తెలియదా ఏమిటి?

టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం అన్ని ప్రయోజనాలు అనుభవించిన మీరు అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీని కాపాడేందుకోసం మీరు, మీ కుటుంబం చేసిన కృషి ఏమిటో చెప్పగలరా?

భవిష్యత్తులో ఒకవేళ ప్రజారాజ్యం అధికారంలోకి రాదనే పరిస్థితి ఏర్పడితే మీరు అదే పార్టీలో కొనసాగుతూ, ఆ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని గట్టిగా హామీ ఇవ్వగలరా? ఇతరుల గురించి విమర్శలు చేయడం చాలా తేలికేనన్న విషయం తెలుసుకుంటే సరి.

వెబ్దునియా పై చదవండి