వారి బాగు పట్టదా..!

మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (17:50 IST)
వార్త : మధ్యంతర భృతి 30శాతానికి తక్కువ కాకుండా చెల్లించాలని ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, సచివాలయ ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కోరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం పది శాతానికి మించి ఇవ్వలేమని చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

చెవాకు : మీరేమో నిత్యావసర వస్తువుల ధరల విపరీతంగా పెరిగిన దృష్ట్యా మధ్యంతర భృతి పది శాతం కాదు, ముప్పై శాతం కావాలని పట్టుబడుతున్నారు కానీ సామాన్యుల మాటేమిటి.

వారి పాటు మాకెందుకు, మా బాగు మాకుంటే చాలునను కుంటున్నారేమో కానీ మీకు ఏం మేలు చేయాలన్నా ప్రభుత్వాధినేతలు ఇచ్చేది వారి చేతుల్లో డబ్బు కాదు ప్రజల సొమ్మేనని గుర్తుంచుకోండి.

ప్రాజెక్టుల కోసం కోట్లాది రూపాయలు పోసి, వాటి ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందనుకున్నా అది కూడా ప్రజలపై భారమే కానీ దానిని కారణంగా చూపి మీరు వారిని మరింత వెనుకబడేలా చేయకండి.

ఉన్న దాంతో సర్దుకు పోవడం నేర్చుకోగలిగితే వారిని కూడా కాస్త ముందుకు తీసుకువచ్చిన వారు కాగలరు. మీ దుబారా ఖర్చులను పది శాతం తగ్గించుకున్నా నిరు పేదల కడుపుకు యాభై శాతం నిండే గంజి లభిస్తుందని గుర్తుంచుకోండి.

వెబ్దునియా పై చదవండి