ఈ క్రమంలో ముఖ్యంగా సముద్ర గర్భాన్ని ఇప్పటివరకు మనిషి చాలా వరకు ఛేదించలేకపోయాడు. మహాసముద్రాల లోతుల్లో ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు నిక్షిప్తమైవున్నాయన్నది బహిరంగ రహస్యం. తాజాగా అలాంటిదే ఓ మిస్టరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వింత ఆకారంలో ఉన్న భయంకరమైన జీవికి సంబంధించిన తొలి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. దీనికి ముద్దుగా హెడ్‌లెస్ చికెన్ మాన్‌స్టర్ అనే పేరు పెట్టారు.
ఈ వింత జీవిని దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో గుర్తించారు. ఎర్రటి రంగులో, పెద్ద సైజులో ఉన్న ఈ జీవికి తల లేదు. అందుకే దీనికి హెడ్‌లెస్ చికెన్ అనే పేరు పెట్టారు. నిజానికి ఇది సముద్ర గర్భంలో నివసించే కుకుంబర్. దీని శాస్త్రీయ నామం ఎనిప్‌నియాస్టీస్ ఎక్జీమియా. దీనిని తొలిసారి 2017లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో తొలిసారి కనిపెట్టినా.. కెమెరాకు చిక్కడం మాత్రం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా ఫిషరీస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా ఈ జీవిని ప్రపంచానికి పరిచయం చేశారు.