21-10-2018 నుంచి 27-10-2018 మీ వార రాశి ఫలితాలు(Video)

శనివారం, 20 అక్టోబరు 2018 (20:06 IST)
కర్కాటకంలో రాహువు, తులలో రవి, బుధ, వక్రి శుక్రులు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు, 26న బుధుడు వృశ్చిక ప్రవేశం. కుంభ, మీన, మేష, వృషభంలలో చంద్రుడు. 21వ తేది నుండి శుక్ర మౌడ్యమి ప్రారంభం. 26న అట్లతద్ధి. 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. మంగళ, బుధ వారాల్లో మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయెుద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. వ్యాపారలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. జూదాల జోలికి పోవద్దు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపునుక అవకాశం లేదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. బంధువులతో స్పర్ధలు తలెత్తుతాయి. గురు, శుక్ర వారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.    
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలు లభిస్తాయి. గృహమార్పులకు అనూకూలం. పనులు నత్తనడకన సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవివాహితులు శుభవార్త వింటారు. మీ నుండి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. శనివారం నాడు నగదు డ్రాచేసేటప్పుడు జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య దాపకరికం తగదు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ఆశాజనకం. పుణ్య కార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పనులు వేగవంతమవుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఆది, సోమ వారాల్లో బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయెుద్దు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.  
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. రుణ విముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంప్రదింపులు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగులకు పదవీయోగం. నగదులాభం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి జనసతేదీలలో సంతృప్తికానవస్తుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆది, గురు వారాల్లో బంధువుల వ్యాఖ్యాలు ఆలోచింపచేస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ధనసహాయం ఆశించవద్దు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలవుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఒక సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్త వింటారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ప్రియతముల ఆహ్వానం సంతోషపరుస్తుంది. వేడుకలకు హాజరవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. కార్యానుకూలత ఉంది. పరిచయాలు బలపడుతాయి. విదేశీ విద్యాయత్నం నిరుత్సాహపరుస్తుంది. ప్రకటనలు విశ్వసించవద్దు. మంగళ, శని వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. మార్కెట్ రంగాల వారిక మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యవహారాల్లో ప్రతికూలతలుంటాయి. పనుల సానుకూలకు ఓర్పు, కృషి ప్రధానం, సంప్రదింపులు ఫలించవు. ఒత్తిడి, ఆందోళన అధికం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అనవసర జోక్యం తగదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు సాయం అర్థిస్తారు. పెద్దమెుత్తం ధనసహాయం శ్రేయస్కరం కాదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. గురు, శుక్ర వారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. పర్మిట్‌లు, లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఉత్సాహాన్నిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. తొందరపడి హామీలివ్వవద్దు. గృహంలో సందడి నెలకొంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆర్థికస్థితి సంతృప్తికరం. రుణ విముక్తులవుతారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనలు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం నగదు, ఆభరణాలు జాగ్రత్త. శనివారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థపడుతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కష్టం ఫలిస్తుంది. పదవులు అందుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. తొందరపడి హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. మెుండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. పనులు ముగింపు దశలో నిదానంగా సాగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణం, మరమ్మత్తులు చేపడతారు. ప్రయాణం లక్ష్యం నెరవేరుతుంది.     
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వాగ్ధాటితో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ప్రత్యర్థుతో జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మెుండిగా పనులు పూర్తిచేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.   
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటారు. యత్నాలు విరవించుకోవద్దు. ఆప్తుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.  మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వీడియోలో వినండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు