నాన్నా ఏందీ రోజూ ఇదే మున్సిపల్ పార్కు... ! ఏమి ఉండదాడ...!! సముద్రంలో అలలు భళే ఉంటాయంట కదా... ఒక్క సారి ఆడికి పోయి వద్దాం నాన్న... ఇలా మీ పాప మొండి కేస్తోందా...
ఏమండీ ఎప్పుడు చూసిన వంటిళ్ళు తప్ప నేను బయటకు కదిలేది లేదా...! ప్రశాంతంగా గాలి పీల్చుకుని బయటకు పోతే బాగుంటుందండీ... రొటీన్ లైఫ్ బోరు కొడుతోందండీ... ఇలా మీ శ్రీమతి కోరుతోందా.... !
వీళ్ళేమో... బయట పోదామంటున్నారు. పార్కులు... రెస్టారెంట్లు మామూలే... ఎక్కడికిపోతే ప్రశాంతంగా ఉంటుందనుకుంటున్నారా...! ఇందులో ఆలోచన ఎందుకండీ... మనదేశంలో చాలా సముద్రతీర ప్రాంతాలు అహ్లాదకరంగా ఉన్నాయి. బీచ్ అనగానే ప్రేమికులు తిరగే ప్రాంతాలే అనే విషయం టక్కున జ్ఞాపకమొస్తుంది. కాని కుటుంబంతో సహా చాలా ఆనందంగా గడిపే తీర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.
చేతిలో స్నాక్స్‌ను కొరుకుతూ, వేడి వేడి సూప్ తాగుతూ కాలం గడిపేస్తే చాలా బాగుంటుంది. మనసు తేలికపడుతుంది. పిల్లలు తీర ప్రాంతంలోని ఇసుకలో ఆడుకుంటూ ఉంటే దంపతులు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగేయవచ్చు. మొత్తం కుటుంబానికి ఆ బీచ్‌లు ఆనందాన్ని పంచి పెడతాయి.
మరి అలాంటి కోవకు చెందిన ఈ సాగరతీరాలు ఎలా ఉంటాయో చూద్దాం రండీ.
పేరు : విశాఖపట్నం బీచ్ ఎక్కడుంది : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత : ఇది చాలా సురక్షితమైన బీచ్ ఇక్కడి గాలికి వళ్ళు పులకించి పోతుంది.
పేరు : భీమునిపట్నం బీచ్ ఎక్కడుంది : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత : ఇది చాలా దూరం కనిపిస్తుంది. ఇక్కడకు దేశ విదేశాల నుంచి జనం వస్తుంటారు.
పేరు : జూహూ బీచ్ ఎక్కడుంది : ముంబయి ప్రత్యేకత : అరేబియా మహా సముద్రంలోని ఇక్కడి సుందర దృశ్యాలు నుంచి కనిపిస్తాయి.
పేరు : చౌపతి బీచ్ ఎక్కడుంది : ముంబయి, మహరాష్ట్ర ప్రత్యేకత : స్నాక్ బార్ బీచ్‌గా పేరు పోయింది. సాయంత్రాలు మారిన్ డ్రైవ్‌లు చాలా ఆనందదాయకంగా కనిపిస్తాయి.
పేరు : మెరీనా బీచ్ ఎక్కడుంది : చెన్నై ప్రత్యేకత : బీచ్‌లలో రెండవ అతి పెద్ద బీచ్ ఇది. ఎక్కువ కుటుంబాలు ఇక్కడకు చేరుతుంటాయి.
పేరు : గోపాల్ పూర్ బీచ్ ఎక్కడుంది : ఒరిస్సా ప్రత్యేకత : ఇక్కడున్న బీచ్ రీసార్ట్ చాలా సుందరమైనది. విశ్రాంతి, ఉత్సాహం, ఉల్లాసం కోరుకునే వారికి ఇది ఎంతగానో ఊరటనిస్తుంది.
పేరు : చండీపూర్ బీచ్ ఎక్కడుంది : ఒరిస్సా ప్రత్యేకత : ఇక్కడున్న నీటిలోతులు సుందరంగా కనిపిస్తాయి. ఇవే ఇక్కడ సుందర వాతావరణానికి కారణం. పిల్లలకైనా, పెద్దలకైనా ఇది సరిగ్గా సరిపోయే బీచ్‌గా చెప్పవచ్చు.
పేరు : పూరీ బీచ్ ఎక్కడుంది : ఒరిస్సా ప్రత్యేకత : పూరీ జగన్నాథ దేవాలయ దర్శనం తరువాత చాలా మంది ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడికి వచ్చి పోయినవారు మంచి అనుభూతిగా ఫీలవుతుంటారు.
పేరు :కోనార్క్ బీచ్ ఎక్కడుంది : ఒరిస్సా ప్రత్యేకత : ఇక్కడున్న ప్రధాన ఆకర్షణ సూర్య దేవాలయమే. అయితే ఈ బీచ్ నుంచి కనిపించే సూర్యాస్తమయం దృశ్యం మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
పేరు :కోవలం బీచ్ ఎక్కడుంది : కేరళ ప్రత్యేకత : ఈతకొట్టడానికి చిన్న పిల్లలకు మంచి వాతావరణం కనిపిస్తుంది. ఇది చాలా సుందర ప్రదేశం జీవితాంతం మనసులో చెరగని ముద్రవేస్తుంది.