పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

ఐవీఆర్

మంగళవారం, 26 ఆగస్టు 2025 (17:38 IST)
వివాహేతర సంబంధాల కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లా వెల్మర్ గ్రామంలో మరో వివాహేతర సంబంధ హత్య కేసు వెలుగుచూసింది. పెళ్లైన 30 ఏళ్ల తర్వాత తన ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను చంపేసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
నిర్మల్ జిల్లా వెల్మర్ గ్రామంలో హరిచరణ్- భార్య నాగలక్ష్మి నివాసం వుంటున్నారు. వీరికి ఒక అబ్బాయి అమ్మాయి సంతానం. ఐతే నాగలక్ష్మి ఇటీవలి కాలంలో తన భర్త కన్నుగప్పి ప్రియుడు మహేష్‌తో గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధాన్ని సాగిస్తోంది. ఐతే వీరి వ్యవహారాన్ని భర్త కనిపెట్టడంతో ఇక అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అర్థరాత్రివేళ తన ప్రియుడికి ఫోన్ చేసింది. అతడు రాగానే నిద్రపోతున్న భర్త గొంతుకి టవల్ ను గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి ఇద్దరూ కలిసి అతడిని చంపేసారు. ఆ తర్వాత ప్రియుడు మహేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
తెల్లారాక... తన భర్త బాత్రూంలో మూర్చ వచ్చి బిళ్లబూటున బోర్లాపడి చనిపోయాడని లబోదిబోమంటూ ఏడవడం ప్రారంభించింది. ఐతే తల్లి ప్రవర్తనపై ఎప్పటి నుంచో అనుమానం వున్న ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో నిజం బైటపడింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు