ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీ

బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో లాభపడిన సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 36 పాయింట్లు కోల్పోయి, 17,129 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 19 పాయింట్లు పడిపోయి, 5,134 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అమెరికా, ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ నిరాశాజనకంగా కొనసాగడంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు కొనసాగుతోంది. దేశీయ మదుపుదారులు సైతం కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపకపోవడం సెన్సెక్స్, నిఫ్టీల పతనానికి దారి తీసిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి