భారత స్టాక్ మార్కెట్లు కుదేలు: రూపాయి దెబ్బతో పతనం

FILE
రూపాయి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 61.60 వద్ద ట్రేడవుతుండగా.. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి.

ఈ ఉదయం నష్టాలతో ఆరంభమైన మార్కెట్లు సాయంత్రం వరకు అదే ఒరవడి కొనసాగించాయి. దీంతో, బీఎస్ఈ సెన్సెక్స్ 449 పాయింట్లు నష్టపోయి18,733 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 5,542 వద్ద క్లోజయింది.

ఇకపోతే.. టీసీఎస్, విప్రో, టాటా మోటార్ షేర్లు లాభాలు ఆర్జించగా.. స్టెరిలైట్ ఇండియా, టాటా స్టీల్, టాటా పవర్ కార్పొరేషన్, హెచ్ డీఎఫ్ సీ, బీహెచ్ఈఎల్ షేర్లు నష్టాలు చవిచూశాయి

వెబ్దునియా పై చదవండి