ఈ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కారణంగా సెన్సెక్స్ తొలిసారి 48 వేల మార్కును అధిగమించింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 308 పాయింట్లు పెరిగి 48,177కి చేరుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 14,132కి ఎగబాకింది.
సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అత్యధికంగా లాభపడిన కంపెనీల షేర్లలో ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్చీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ వంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ తదితర కంపెనీల షేర్లు లాభాలను చవిచూశాయి.