అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్: భారత జట్టు ప్రకటన

FILE
జూనియర్ సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్ జట్టును ప్రకటించారు. ఇందులో పదిమంది హర్యానా, నలుగురు పంజాబ్ అథ్లెట్లకు కూడా స్థానం దక్కింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో జరిగే ఈ టోర్నీలో ఆప్ఘనిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంకలు పాల్గొంటాయి.

ఈ సందర్భంగా హర్యానా స్టేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (హెచ్ఎస్ఎఎ) కార్యదర్శి హనుమాన్ సింగ్ మాట్లాడుతూ.. జాతీయ అథ్లెటిక్ జట్టులో హర్యానా ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. తప్పకుండా తమ ఆటగాళ్లు చెన్నై అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గట్టిపోటీని ప్రదర్శించి పతకాలు సంపాదించిపెడతారని నమ్మకం వ్యక్తం చేశారు.

జాతీయ అథ్లెటిక్ జట్టులో స్థానం పొందిన హర్యానా ఆటగాళ్ల వివరాలకెళితే.. పర్వీన్ కుమార్ 200మీ (సోనిపట్), ధర్మ్‌బీర్-200మీ (రొహ్‌టక్), నరేష్-షాట్‌పుట్ (సోనిపట్), మనీషా-100మీ (సోనిపట్), మనీషా దేవి-400మీ (రొహ్‌టక్), సాక్షి-800మీ(జాహ్జార్), ఆర్తీ యాదవ్-హై జంప్ (సీర్సా), పర్మీలా-డిస్కర్ (హిసార్), రింకు సాంగ్వాన్-డిస్కస్ (భీవాని), పూనమ్-జావెలిన్ (జాహ్జార్).

వెబ్దునియా పై చదవండి