అర్జెంటీనా పేలవ ప్రదర్శన: ఒత్తిడిలో లియోనల్ మెస్సీ!

అర్జెంటీనా పేలవ ప్రదర్శనతో స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి తలనొప్పిగా మారింది. కోపా అమెరికాలో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లో అర్జెంటీనా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. తద్వారా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన కెరీర్‌లో అనూహ్యంగా ఒత్తిడికి గురవుతున్నాడు.

అర్జెంటీనా జట్టు సభ్యులు మెరుగ్గా రాణించకపోవడం ద్వారా అర్జెంటీనా బుధవారం కొలంబియాతో జరిగిన మ్యాచ్‌ను 0-0 పాయింట్ల తేడాతో డ్రాగా ముగించింది. దీంతో లియోనల్ మెస్సీ ఒత్తిడికి గురైయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే జట్టు లైనప్‌ను మార్చేందుకు కోచ్ సెర్జియో బాటిసా నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం కోస్టా రికాతో జరిగే మ్యాచ్‌లో జట్టు లైనప్‌లో మార్పు తప్పనిసరి అని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో లియోనల్ మెస్సీ ఒత్తిడిలో ఉన్నాడని ఆయన తండ్రి జోర్జ్ తెలిపాడు. జట్టు సభ్యుల పేలవమైన ఆటతీరుతో మెస్సీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని చెప్పాడు. అలాగే బార్సిలోనా మరియు అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ జావేర్ మాట్లాడుతూ.. అర్జెంటీనా జట్టు పేలవ ప్రదర్శనకు మెస్సీ కారకుడు కాదని, తామే (జట్టు) సభ్యులు సరిగ్గా ఆడలేదని, ఇదే కొనసాగితే అభిమానులచే పరాభవం తప్పదని జావేర్ సభ్యులకు హెచ్చరించాడు.

వెబ్దునియా పై చదవండి