నాదల్, ఫెదరర్ యుగం ముగిసింది: విల్ఫ్రెడ్ సోంగా

టెన్నిస్ స్టార్స్ రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల యుగం ముగిసిందని ఫ్రెంచ్‌మన్ జో-విల్ఫ్రెడ్ సోంగా వ్యాఖ్యానించాడు. ఏటీపీ రోటెర్డామ్ ఓపెన్‌ రెండో రౌండ్లో గెలిచిన సోంగా రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల యుగం ముగిసిందని సోంగా తెలిపాడు. బల్గేరియన్ గ్రిగోర్ దిమిత్రోవ్‌తో జరిగిన రెండో రౌండ్లో సోంగా 6-4, 6-4 తేడాతో మట్టికరిపించాడు.

ఎనిమిదో సీడ్ అయిన విల్ఫ్రెడ్ సోంగా 2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నోవాక్ జకోవిక్ చేతిలో ఖంగుతిన్నాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న విల్ఫ్రెడ్ సోంగా, ఫెదరర్, నాదల్‌ల టెన్నిస్ కెరీర్ ముగిసినట్లేనని వ్యాఖ్యానించాడు.

నాదల్, ఫెదరర్‌లు టాప్ ర్యాంకుల్లో కొనసాగలేరన్నాడు. 75 నిమిషాలపాటు జరిగిన పోరులో 19 ఏళ్ల దిమిత్రోవ్‌ను మట్టికరిపించిన సోంగా, నాదల్, ఫెదరర్‌ల విజయాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయన్నాడు. ఇంకా జకోవిచ్, ముర్రేలు నాదల్, ఫెదరర్‌లపై గెలుపొందుతున్నారని సోంగా తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి