శాఫ్ ఫుట్‌బాల్ టోర్నీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్!
శనివారం, 10 డిశెంబరు 2011 (09:41 IST)
శాఫ్ (దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య) ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ టైటిల్ పోరు బరిలోకి దిగనుంది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో మాల్దీవుల జట్టును మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. తద్వారా ఈ టోర్నీలో భారత్ ఎనిమిదవసారి ఫైనల్స్‌కు చేరింది.
స్టార్ స్ట్రైకర్ సునీల్ ఛత్రీ రెండు గోల్స్ సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రహీమ్ నబీ 24వ నిముషంలో తొలి గోల్‌ను సాధించి భారత్‌కు 1-0 ఆధిక్యతను అందించగా, ఆ తర్వాత ఛత్రీ 69వ నిముషంలోనూ, 90వ నిముషంలోనూ మరో రెండు గోల్స్ సాధించిపెట్టాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో మాల్దీవుల జట్టు సాధించిన ఏకైక గోల్‌ను 60వ నిముషంలో షామ్‌వీల్ కాసిం సాధించిపెట్టాడు. అయితే ఆ తర్వాత మాల్దీవుల జట్టు ఒక్క గోల్‌ను కూడా సాధించలేకపోవడంతో పరాజయం పాలైంది.