Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

దేవీ

సోమవారం, 28 ఏప్రియల్ 2025 (10:14 IST)
Chiranjeevi, Sridevi
మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990 మే9న విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద అఖండ విజయాన్ని అందుకుంది. వైజయంతీ మూవీస్‌ అశ్వనీదత్ నిర్మాణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌.
 
మే 9వ తేదీతో ఈ సినిమా విడుదలై 35ఏళ్లు అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమాని మే 9వ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 35 ఏళ్ల క్రితం మే 9న విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని మళ్ళీ అదే మే9న రీరిలీజ్ చేయడం విశేషం. 2డీతో పాటు, 3డీలోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరో హైలెట్.  
 
తెలుగు సినిమా చరిత్రలోనే ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌, మైల్ స్టోన్ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరు- శ్రీదేవిల నటన, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, నిర్మాత అశ్వనీదత్ విజన్, మేస్ట్రో ఇళయరాజా సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
 
నిర్మాత అశ్వనీదత్‌ సినిమాపై ఉన్న ప్యాషన్‌తో అప్పటివరకూ ఎవరూ ఖర్చు చేయలేనంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ హిస్టారికల్ సక్సెస్ సాధించింది.
 
ఇప్పుడు రీరిలీజ్ లో 2డీతో పాటు, 3డీలోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. జగదేక వీరుడు అతిలోక సుందరిని అప్పట్లోనే విజువల్ వండర్ గా తీశారు. త్రీడీ వెర్షన్ ఇప్పటి ఆడియన్స్ కి  వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు