ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ తదితర క్రీడల నిర్వహణ పెను భారమవుతుండడంతో ఆతిథ్యానికి కొన్ని దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. మోయలేని ఆర్థిక భారమంటూ 2024 ఒలింపిక్స్ బిడ్డింగ్ సమయంలోనే బుడాపెస్ట్ తప్పుకుంటే... తాజాగా ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ (2022) ఆతిథ్య హక్కులు పొందిన డర్బన్ డబ్బుల్లేవంటూ తప్పుకునేందుకు సిద్ధమైంది. మెగా ఈవెంట్ బడ్జెట్ భారంగా ఉందని, అంత వ్యయం చేయలేమంటూ దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి ఫికిల్ ఎంబలులా స్పష్టం చేశారు. తమ ఆర్థిక వ్యవస్థ దీని వల్ల ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశముందని, అందుకే అన్నీ ఆలోచించాకే తప్పుకునేందుకు నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. 2015లోనే 2022కు సంబంధించిన కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు డర్బన్‌కు దక్కాయి.