ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా అభినవ్ బింద్రా

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:45 IST)
భారత షూటర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్' (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్స్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఐఎస్ఎస్ఎఫ్ ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా వెల్లడించింది. 32 ఏళ్ల బింద్రా ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ షూటర్‌గా అవతరించాడు. 
 
ఈ క్రమంలో ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్‌లో అతను సభ్యుడవుతాడు. దీనపై బింద్రా స్పందిస్తూ.. ఇలా ఎన్నిక కావడం నాకే కాకుండా దేశానికి కూడా ఇది గొప్ప గౌరవం. షూటర్ల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకునేందుకు నాకు ఈ బాధ్యత అప్పగించారు. ఈ క్రమంలో చివరి వరకు న్యాయం చేసేందుకే చూస్తాను అని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి