ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కరోనా సెగ: క్వారంటైన్‌లోకి 72 మంది క్రీడాకారులు

సోమవారం, 18 జనవరి 2021 (13:07 IST)
Australia Open
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కరోనా సెగ తగిలింది. ఈ ఓపెన్ కోసం ఆటగాళ్లను, సిబ్బందిని తీసుకువచ్చిన చార్టెడ్ విమానంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. దీంతో మొత్తం 72 మంది క్రీడాకారులను క్వారంటైన్‌కు తరలించారు. ఫలితంగా ఈ క్రీడాకారులంతా హోటళ్లలో తమకు కేటాయించిన గదుల్లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సివస్తుంది. దీంతో వారు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం కూడా అవకాశం లేదు. 
 
ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు దోహా నుంచి వచ్చిన విమానంలోని ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరినీ క్వారంటైన్‌కు తరలించారు. అదేవిమానంలో వచ్చిన మరో 58 మంది ప్రయాణికులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఇక మిగతా క్రీడాకారుల కోసం సింగపూర్, లాస్ఏంజెలెస్ నుంచి కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. మొత్తం 15 చార్టెడ్ ఫ్లైట్స్ క్రీడాకారులు, అధికారులు, ఇతర సిబ్బందిని తీసుకొని ఆస్ట్రేలియా రానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు