ఫిఫా ప్రపంచకప్: ఫ్రాన్స్ గెలుపు .. ఫైనల్‌లో అర్జెంటీనాతో ఢీ
గురువారం, 15 డిశెంబరు 2022 (10:20 IST)
france
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. మొరాకోతో జరిగిన సెమీఫైనల్‌లో 2-0తో విజయం సాధించి ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలి నుంచీ ఆధిపత్య ప్రదర్శించిన ఫ్రాన్స్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే ఫ్రాన్స్ ఆటగాడు థియో హెర్నాండెజ్ అద్భుత గోల్‌తో ఖాతా తెరిచాడు. 79 నిమిషం వద్ద రాండల్ కోలో మువానీ గోల్ సాధించడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 2-0కు పెరిగింది.
మరోవైపు మ్యాచ్‌లో చాలా భాగం బంతి మొరాకో నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు.
తద్వారా ఫ్రాన్స్ గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా ఆఫ్రికా నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. కాగా, ఆదివారం జరగనున్నఫైనల్‌లో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడుతుంది.