లూయిస్ హామిల్టన్‌కు కరోనా.. సాఖిర్ గ్రాండ్ ప్రి దూరం..

మంగళవారం, 1 డిశెంబరు 2020 (14:24 IST)
Hamilton
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు, క్రీడాకారులు.. ఇలా ఎవరికీ కూడా కరోనా మినహాయింపును ఇవ్వడం లేదు. ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌కు కూడా కరోనా సోకింది. ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ కరోనా బారిన పడ్డాడు. 
 
ఏడుసార్లు ఎఫ్ 1 ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన హామిల్టన్‌‌కు గత వారంలో మూడుసార్లు పరీక్షలు నిర్వహించినా.. ప్రతిసారీ నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు టీమ్ చెప్పింది. ఆదివారం బహ్రెయిన్ గ్రాండ్ ప్రి కూడా గెలిచిన తర్వాత సోమవారం ఉదయం అతనికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత టెస్ట్ చేస్తే కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించింది. ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఉన్న హామిల్టన్‌.. అక్కడి నిబంధనల మేరకు ఐసోలేషన్‌లో ఉన్నాడు.
 
స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. అతడికి ఎటువంటి ఇబ్బందులు లేవని అతడి బృందం ప్రకటనలో తెలిపింది. కరోనా పాజిటివ్ రావడంతో హామిల్టన్ సాఖిర్ గ్రాండ్ ప్రికి దూరమవుతున్నట్లు మెర్సెడీజ్‌-ఏఎంజీ పెట్రొనాస్ ఎఫ్‌1 టీమ్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు