బాలీవుడ్ సింగ్ కుమార్ సనుకు కరోనా పాజిటివ్

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (13:03 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడంలేదు. పేద, ధనిక అని తేడాలేదు. సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరినీ కాటేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కోలుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ కుమార్ సనుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు జరిపిన నిర్ధారణ పరీక్షల్లో ఈ విషయం తేలింది. దీంతో ఆయన అభిమానుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అభిమానులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు కుమార్ స‌ను త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ద‌న‌లు చేస్తున్నారు. 
 
కాగా, కుమార్ సను కూడా తనకు కరోనా వైరస్ సోకినట్టు ధృవీకరించారు. "దురదృష్టవశాత్తు సనుడా కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దయచేసి నా ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థించండి. థ్యాంక్యూ మై టీమ్‌" అంటూ పోస్ట్ చేశారు. 
 
కుమార్‌ సాను 1990లో బాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాట‌ల‌కు త‌న గానాన్ని అందించారు. బీబీసీ టాప్‌ 40 బాలీవుడ్‌ సౌండ్‌ట్రాక్స్‌లో కుమార్‌ పాటలు దాదాపు 25 ఉన్నాయి. అతను 30 భాషల్లో  21 వేల పాటలను పాడి రికార్డు సృష్టించారు. 
 
అంతేగాక కేవలం ఒకే రోజులో 28 పాటలు పాడి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. ప్రస్తుతం కుమార్‌ సాను కుమారుడు జాన్‌ బిగ్‌బాస్‌ 14లో కంటెస్టెంటుగా ఉన్నారు. ఈయన 2009లో పద్మ శ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. సనూకు భార్య సలోని, కూతుళ్లు షానూన్‌, అన్నాబెల్‌ ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు