ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్

శుక్రవారం, 9 జులై 2021 (07:20 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ పోటీలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు కరోనా డెల్టా వేరియంట్ అడ్డంకిగా మారింది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్ క్రీడలు నిర్వహించనున్నట్టు జపాన్ ఒలింపిక్స్ మంత్రి తమాయో మరుకవా వెల్లడించారు. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు అందుకు అంగీకరించారని తెలిపారు.
 
టోక్యోలో కొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఆ కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్ కారణంగానే అని గుర్తించారు. దాంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం టోక్యోలో ఆగస్టు 22 వరకు అత్యయిక పరిస్థితి అమల్లో ఉంటుందని ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు