ఇతర దేశాలపై నోరు పారేసుకునేముందు నీ సొంత పనేంటో చూసుకోమని ఘాటుగా బదులిచ్చారు. ఎవరైనా, ఏదైనా గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ, మా దేశ సంస్కృతిలో కాదంటూ గట్టిగా మందలించారు.
'ఒలింపిక్స్ ఇండియా వరెస్ట్ కంట్రీ' అనే శీర్షికతో న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. భారత్ రెండు మెడల్స్ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది.