జూలియా లెమిగోవాను పెళ్లాడిన మార్టినా నవ్రతిలోవా!

గురువారం, 18 డిశెంబరు 2014 (11:37 IST)
టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా (58) సాహసం చేసింది. ఐదు పదుల వయస్సులో తొలిసారిగా పెళ్లాడానని ప్రకటించింది. 2006 నుంచి డేటింగ్  డేటింగ్ చేస్తున్న జూలియా లెమిగోవాను పెళ్లాడింది. తాను తొలిసారిగా పెళ్లాడానని నవ్రతిలోవా పేర్కొంది. వీరిద్దరూ చేస్తున్నారు.
 
నవ్రతిలోవాతో వివాహంపై లెమిగోవా మాట్లాడుతూ, ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. కాగా, 42 ఏళ్ల లెమిగోవా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు 1990లో 'మిస్ యూఎస్ఎస్ఆర్' టైటిల్ నెగ్గింది. 1991లో నిర్వహించిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.

వెబ్దునియా పై చదవండి