నేషనల్ కబడ్డీ ప్లేయర్... భార్య సూసైడ్ చేసుకునేలా చిత్రహింసలు పెట్టాడు.. జైలు పాలయ్యాడు

శుక్రవారం, 21 అక్టోబరు 2016 (14:46 IST)
భారత జాతీయ జట్టు కబడ్డీ ఆటగాడు రోహిత్ చిల్లార్. ఈయన భార్యను చిత్ర హింసలు పెట్టి.. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణలపై జైలుపాలయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్ రోహిత్ చిల్లార్‌కు లలిత అనే భార్య ఉంది. అదనపు కట్నం కోసం తన భర్త, అత్తమామలు వేధించారని, అందుకే, ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ లలిత ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టి తనువు చాలించింది. సోమవారం రాత్రి ఢిల్లీలోని తాము నివశించే ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి... సూసైడ్ నోట్ ఆధారంగా రోహిత్ చిల్లార్‌ను అరెస్టు చేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో 2 గంటల ఆడియో టేపులతో పాటు, ఒక సూసైడ్ నోట్‌ను కూడా సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి