నాపై చేతబడి ప్రభావం వుంది.. అందుకే ఒత్తిడి తప్పట్లేదు.. సోహైల్

బుధవారం, 9 జనవరి 2019 (10:54 IST)
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. మూడో టెస్టుకు ప్రస్తుతం మరో కష్టం తప్పేలా లేదు. పాకిస్థాన్ క్రికెటర్ హ్యారిస్ సోహైల్ జట్టుకు గాయం కారణంగా దూరం కావడం జట్టుకు కష్టాల్లో నెట్టింది. ఈ నేపథ్యంలో బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మన్ అయిన హ్యారిస్ సోహైల్.. చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
తనపై చేతబడి జరిగిందని సోహైల్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. చేతబడి ప్రభావం వల్లే తాను ఒత్తిడికి గురవుతున్నానని చెప్పాడు. దక్షిణాఫ్రికా నుంచి పాకిస్థాన్ చేరుకున్న సోహైల్ రిహాబిలేటషన్ సెంటర్‌కు వెళ్లాల్సి వుంది. కానీ తన స్వగ్రామమైన సియోల్‌కోట్‌కు వెళ్లాడు. అయితే సోహైల్ ఇలా ప్రవర్తించడం కొత్తకాదని.. 2015లోనూ ఇదే విధంగా ప్రవర్తించాడు. 
 
ఇకపోతే.. ఇంగ్లండ్, ఆసీస్, యూఏఈ, కివీస్‌లతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సోహైల్ దక్షిణాఫ్రికా టెస్టుకు దూరం కావడం జట్టుకు నష్టమేనని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు