ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి మహిళగా రికార్డు... ఫైనల్స్ పోరులో పోరాడి ఓడిన సింధు...

శుక్రవారం, 19 ఆగస్టు 2016 (21:16 IST)
విశ్వక్రీడలు రియో ఒలింపిక్ క్రీడల్లో తెలుగుతేజం పి.వి. సింధు ప్రపంచ నెంబర్ 1 స్పెయిన్ క్రీడాకారిణి మరీన్ కరోలినాతో పోరాడి ఓడింది. మహిళల సింగిల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో తొలి రజతకాన్ని సాధించిన ఘనతను సొంతం చేసుకుంది. వ్యక్తిగత పతకం సాధించిన ఐదో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 
 
ఆట తొలి రౌండ్ నుంచి అద్భుత ప్రదర్శనను వరల్డ్ నెంబర్ వన్ కరొలినా మరీన్ రియో ప్రదర్శించింది. ఐతే అనూహ్యంగా తొలి సెట్‌ను సింధు గెలుచుకుని స్వర్ణ పతకం ఆశలను రేపింది. ఐతే ఆ తర్వాత వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి మరీనా తన అద్భుత ఆట తీరును ప్రదర్శిస్తూ సింధును కోలుకోలేని దెబ్బ తీసింది. వరుసగా రెండు సెట్లను తన ఖాతాలో వేసుకోవడంతో స్వర్ణ పతకం ఆమె సొంతమైంది. మరీన్ 21-12, 12-21, 15-21 తేడాతో సింధుపై విజయం సాధించింది.
 
బ్యాడ్మింటన్ క్రీడలో ఉన్న విన్యాసాలన్నీ... బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, ర్యాలీ, డ్రాప్, స్మాష్ ఇలా ప్రతి అంశంలోనూ సింధు కంటే మరీన్ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో స్వర్ణం చేజారింది. ఐతే సింధు ప్రపంచ ఆల్ రౌండర్‌తో చివరి వరకూ పోరాడింది. ఏదైమనప్పటికీ సింధు తన శక్తిమేర చివరి వరకూ పోరాడి రజత పతకంతో భారతదేశ పతాకాన్ని ఒలింపిక్ క్రీడల్లో రెపరెపలాడించింది.

వెబ్దునియా పై చదవండి