అయితే, నర్సింగ్ యాదవ్ రూమ్మేట్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోప్ పరీక్షలో పట్టుబడ్డారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షలో వీరిద్దరూ నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. అయితే నిషేధిత ఉత్ర్పేరకాలను తాము వాడలేదని నర్సింగ్ యాదవ్, సందీప్ యాదవ్ వాదిస్తున్నారు.
దీనిపై నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ తనపై కుట్ర జరిగిందని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశాడు. ఏనాడూ తాను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. అలాగే, సందీప్ స్పందిస్తూ... భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్, తాను ఒకే రూమ్లో ఉన్నామని, తాము తిన్న ఆహారంలో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి ఉంటారని భావిస్తున్నట్టు సందేహం వ్యక్తం చేశారు.