ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళల ఛాంపియన్షిప్ ఫైనల్స్లో సెరీనా విలియమ్స్ విజయం సాధించి ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచింది. సింగిల్స్ ఫైనల్లో రష్యా బ్యూటీ షరపోవాకు ఓటమి తప్పలేదు. ఫలితంగా సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించిన సెరెనా విలియమ్స్ ఆరవ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల ఛాంపియన్గా నిలిచింది. దీంతో సెరీనా విలియమ్స్ 19వ గ్రాండ్ స్లామ్ను సొంతం చేసుకున్నట్లయింది.
ఇకపోతే.. సెరెనా తాజా విజయంతో 19 మేజర్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన మార్టినా నవ్రోతిలోవా, క్రిస్ ఎవర్ట్ల సరసన చేరింది. 2004 నుంచి 16 సార్లు పోటీపడిన సెరీనా విలియమ్స్... తాజాగా రష్యన్ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ 2 మారియా షరపోవాను ఓడించింది.