ఆ ఫుట్ బాల్ మ్యాచే కొంపముంచిందా..?

సోమవారం, 30 మార్చి 2020 (19:49 IST)
Football
ఇటలీలో ఆ ఫుట్‌బాల్ మ్యాచే కరోనా వైరస్ భారీగా వ్యాపించేందుకు కారణమైందని తెలుస్తోంది.ఫిబ్రవరి 19న ఇటలీలోని మిలన్‌ నగరంలో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు స్పెయిన్‌ నుంచి 3వేల మంది వెలన్షియా క్లబ్‌ అభిమానులు హాజరయ్యారు. అప్పటికే ఇటలీలో వైరస్‌తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు 40 వేల మంది ఇటాలియన్లు కూడా వీక్షించడంతో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. 
 
ఈ మ్యాచ్‌ను స్టేడియంతో పాటు బార్లు, బహిరంగ ప్రదేశాల్లో వేలాదిమంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. అనంతరం రెండు రోజులకే లొంబర్డీ ప్రాంతంలోని ఒక ఇటలీ దేశస్థుడికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. అప్పటికే అతను వందలమందితో సన్నిహితంగా మెలిగాడు. ఆ వందలమంది వేలమందికి వైరస్‌ అంటించారు. 
 
అటు స్పెయిన్‌లోనూ మ్యాచ్‌కు వెళ్లివచ్చినవారిలో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. స్పెయిన్‌లోని వెలన్షియాలో పలువురు అదే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో అనేకమంది ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు వెళ్లి వచ్చిన వారు లేదా వారి కుటుంబసభ్యులు కావడం గమనార్హం.
 
కరోనా మహమ్మారిని గుర్తించిన స్పెయిన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అయితే ప్రజలు పట్టించుకోలేదు. మార్చి 13న స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు. కేంద్రప్రభుత్వ వైఖరి నచ్చని అనేక ప్రాంతాలు లాక్‌డౌన్‌ను ప్రశ్నించడంతో లాక్‌డౌన్‌ లక్ష్యం నీరుగారింది. దీంతో వైరస్‌ వ్యాప్తి అధికం కావడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు