ప్యారీస్ ఒలింపిక్స్ 2024 నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను జాబితా నుంచి తొలగిస్తున్న ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసింది. ఇకపై ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ ఉండబోదని ఐవోసీ ఆదివారం స్పష్టం చేసింది. ఆదివారం జరిగిన సమావేశంలో ఐవోసీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇకపై మీరాబాయ్ చాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశమే లేకుండా పోయింది.
పురుషుల విభాగంలో తొలి ఒలింపిక్స్‌లోనే వెయిట్ లిఫ్టింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 1920 నుంచి ఇది రెగ్యులర్ ఈవెంట్‌గా ఉంటూ వచ్చింది. ఇక మహిళల విభాగంలో 2000 నుంచి ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ ఒక ఈవెంట్‌గా చేర్చారు. అయితే వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న క్రీడ కావడంతో దీన్ని తొలగించాలని ఐవోసీ నిర్ణయం తీసుకుంది.